లేఖనాలను అన్వేషించండి

లూకా 5: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 4:21

ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయియొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.

మార్కు 1:19

ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.

మత్తయి 4:18

యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.