మార్కు 11: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవునియందు విశ్వాసముంచుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమియంతటి మీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక; ప్రభువు వచ్చుచున్నాడు
అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.
నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.
శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపుచెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
అందుకాయన ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ? ఇది ఆయన శిష్యులు వినిరి.
అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.