మార్కు 11: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
యేసు నేనును మిమ్మునొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా
వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోననెను.
నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.