లేఖనాలను అన్వేషించండి

మార్కు 11: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మునడిగినయెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 21:2

మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;

మత్తయి 21:3

ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.

లూకా 19:30

మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిదపిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు

లూకా 19:31

ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.

1సమూయేలు 9:15

సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను.

యిర్మియా 32:7

నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.

మార్కు 14:13

ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;

యోహాను 2:7

యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.