మార్కు 11: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అక్కడ నిలిచియున్నవారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు, గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను
ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహకపశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.