లేఖనాలను అన్వేషించండి

మార్కు 14: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతినొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 26:36

అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి

మత్తయి 26:37

పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను.

మత్తయి 26:38

అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి

మత్తయి 26:39

కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

మత్తయి 26:40

ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొని యుండలేరా?

మత్తయి 26:41

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి

మత్తయి 26:42

మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కానియెడల, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి

మత్తయి 26:43

తిరిగివచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.

మత్తయి 26:44

ఆయన వారిని మరల విడిచివెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను.

మత్తయి 26:45

అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియ వచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

మత్తయి 26:46

లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను.

లూకా 22:39

వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా--చాలునని ఆయన వారితో చెప్పెను.

యోహాను 18:1

యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.

యోహాను 18:2

యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.

యోహాను 18:3

కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.

యోహాను 18:4

యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

యోహాను 18:5

వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.

యోహాను 18:6

ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీదపడిరి.

యోహాను 18:7

మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా

యోహాను 18:8

యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.

యోహాను 18:9

నీవు నాకు అనుగ్రహించినవారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.

యోహాను 18:10

సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.

యోహాను 18:11

ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

మార్కు 14:36

నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.

మార్కు 14:39

తిరిగిపోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.

కీర్తనలు 18:5

పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

కీర్తనలు 18:6

నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.

కీర్తనలు 22:1

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?

కీర్తనలు 22:2

నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

కీర్తనలు 88:1

యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు

కీర్తనలు 88:2

నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవియొగ్గుము

కీర్తనలు 88:3

నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.

కీర్తనలు 109:4

నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను.

హెబ్రీయులకు 5:7

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.