మార్కు 14: 47
క్రాస్-రిఫరెన్స్‌లు
" దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.
మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.