నెహెమ్యా 11: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి.
కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.
అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.
కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;
ఇస్హారీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.
అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.
లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,
యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు