లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 11: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 9:7

బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,

1దినవృత్తాంతములు 9:8

యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.

1దినవృత్తాంతములు 9:9

వీరును వీరి సహోదరులును తమ తమ వంశముల పట్టీలచొప్పున తొమ్మిదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమ పితరుల వంశములనుబట్టి తమ పితరుల యిండ్లకు పెద్దలు.

1దినవృత్తాంతములు 8:28

వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునైయుండి యెరూషలేమునందు కాపురముండిరి.

నెహెమ్యా 8:4

అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.