సంఖ్యాకాండము 32: 41
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయుయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.
వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను.
మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలాదులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డ గడలునుగల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను.