Logo

1రాజులు అధ్యాయము 21 వచనము 5

1రాజులు 21:25 తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.

1రాజులు 16:31 నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.

1రాజులు 18:4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.

1రాజులు 19:2 యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.

ఆదికాండము 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

2సమూయేలు 13:4 రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

నెహెమ్యా 2:2 కాగా రాజు నీకు వ్యాధి లేదుగదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖముచేతనే అది కలిగినదని నాతో అనగా

ఎస్తేరు 4:5 అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టియుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసికొనుటకు మొర్దెకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.

1రాజులు 19:1 ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా

2రాజులు 3:2 ఇతడు తన తలిదండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.