Logo

1రాజులు అధ్యాయము 21 వచనము 14

2సమూయేలు 11:14 ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతనియొద్దనుండి వెళ్లిపొమ్మని

2సమూయేలు 11:15 యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను.

2సమూయేలు 11:16 యోవాబు పట్టణమును ముట్టడివేయుచుండగా, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.

2సమూయేలు 11:17 ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.

2సమూయేలు 11:18 కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

2సమూయేలు 11:19 యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

2సమూయేలు 11:20 గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయెనా?

2సమూయేలు 11:21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతనిమీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా? ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

2సమూయేలు 11:22 దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.

2సమూయేలు 11:23 ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితివిు.

2సమూయేలు 11:24 అప్పుడు ప్రాకారముమీదనుండి విలుకాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియాకూడ హతమాయెను.

ప్రసంగి 5:8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.

ప్రసంగి 8:14 వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.

2రాజులు 10:8 దూత అతనియొద్దకు వచ్చిరాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయమువరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.