Logo

1రాజులు అధ్యాయము 21 వచనము 6

1రాజులు 21:2 అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.

ఎస్తేరు 5:9 ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకైమీద బహుగా కోపగించెను.

ఎస్తేరు 5:10 అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి

ఎస్తేరు 5:11 తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానినిగూర్చియు వారితో మాటలాడెను.

ఎస్తేరు 5:12 మరియు అతడు రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.

ఎస్తేరు 5:13 అయితే యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజనమేమియు లేదని అతడు చెప్పగా

ఎస్తేరు 5:14 అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.

ఎస్తేరు 6:12 తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను; అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన యింటికి త్వరగా వెళ్లిపోయెను.

సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

1తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

1తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

యాకోబు 4:2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు.

యాకోబు 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.

యాకోబు 4:4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

యాకోబు 4:5 ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

యాకోబు 4:6 కాదుగాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

1రాజులు 21:3 అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా

1రాజులు 21:4 నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పినదానినిబట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.