Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 2 వచనము 15

1సమూయేలు 16:10 యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి

1సమూయేలు 16:11 నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

1సమూయేలు 17:12 దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను.

1సమూయేలు 17:13 అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

1సమూయేలు 17:14 దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని

న్యాయాధిపతులు 1:16 మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.

రూతు 4:22 యెష్షయి దావీదును కనెను.

1సమూయేలు 26:6 అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా నీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.

2సమూయేలు 2:18 సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

2సమూయేలు 3:39 పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలము గలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.

మత్తయి 1:6 యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.