Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 2 వచనము 50

1దినవృత్తాంతములు 2:19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

1దినవృత్తాంతములు 2:20 హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.

1దినవృత్తాంతములు 2:53 కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి.

1దినవృత్తాంతములు 13:5 కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొనివచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు నుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.

1దినవృత్తాంతములు 13:6 కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.

యెహోషువ 15:9 ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.

యెహోషువ 15:60 కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

1సమూయేలు 7:1 అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

ఆదికాండము 4:20 ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.

1దినవృత్తాంతములు 4:4 మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

1దినవృత్తాంతములు 8:13 బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

1దినవృత్తాంతములు 9:35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.

ఎజ్రా 2:21 బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.