Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 7 వచనము 14

1దినవృత్తాంతములు 2:21 తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.

1దినవృత్తాంతములు 2:22 సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను.

1దినవృత్తాంతములు 2:23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.

ఆదికాండము 50:23 యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.

సంఖ్యాకాండము 26:29 మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదు పుత్రులు.

సంఖ్యాకాండము 26:30 ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:31 అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

సంఖ్యాకాండము 26:32 షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

సంఖ్యాకాండము 26:33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.

సంఖ్యాకాండము 26:34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడువందలమంది.

సంఖ్యాకాండము 27:1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.

సంఖ్యాకాండము 32:30 అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా

సంఖ్యాకాండము 32:31 గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.

సంఖ్యాకాండము 32:32 మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నదిదాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.

సంఖ్యాకాండము 32:33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.

సంఖ్యాకాండము 32:34 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను

సంఖ్యాకాండము 32:35 యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

సంఖ్యాకాండము 32:36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.

సంఖ్యాకాండము 32:37 రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను

సంఖ్యాకాండము 32:38 షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.

సంఖ్యాకాండము 32:39 మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.

సంఖ్యాకాండము 32:40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను

సంఖ్యాకాండము 32:41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము 32:42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

ద్వితియోపదేశాకాండము 3:13 ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలినదానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 3:14 మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయుయొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

ద్వితియోపదేశాకాండము 3:15 మాకీరీయులకు గిలాదునిచ్చితిని.

యెహోషువ 13:31 గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.

యెహోషువ 17:1 మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.

యెహోషువ 17:2 మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయుల కును షెకెమీయులకును హెపెరీయులకును షెమీ దీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది.

యెహోషువ 17:3 మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్ట లేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి.

న్యాయాధిపతులు 5:14 అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.

ఆదికాండము 46:20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.

సంఖ్యాకాండము 1:34 మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 36:1 యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే యెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి