Logo

ఎజ్రా అధ్యాయము 8 వచనము 36

ఎజ్రా 7:21 మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యము కాకుండ మీరు దాని చేయవలెను.

ఎజ్రా 7:22 వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.

ఎజ్రా 7:23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను?

ఎజ్రా 7:24 మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరినిగూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

ఎజ్రా 4:7 అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.

ఎజ్రా 4:8 మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.

ఎజ్రా 4:9 అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్సత్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును

ఎజ్రా 4:10 ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.

ఎజ్రా 4:11 వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా

ఎజ్రా 4:12 తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.

ఎజ్రా 4:13 కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యక యుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

ఎజ్రా 4:14 మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితివిు.

ఎజ్రా 4:15 మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియవచ్చును.

ఎజ్రా 4:16 కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంతమాత్రము ఉండదు.

ఎజ్రా 4:17 అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా

ఎజ్రా 4:18 మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.

ఎజ్రా 4:19 అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.

ఎజ్రా 4:20 మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లు చుండెను.

ఎజ్రా 4:21 కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.

ఎజ్రా 4:22 ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.

ఎజ్రా 4:23 రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరము యొక్క ప్రతి రెహూమునకును షివ్షుయికిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లు చేయగా

ఎజ్రా 5:6 నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు

ఎజ్రా 5:7 రాజైన దర్యావేషునకు సకల క్షేమప్రాప్తి యగునుగాక.

ఎజ్రా 5:8 రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

ఎజ్రా 5:9 ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు.

ఎజ్రా 5:10 వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా

ఎజ్రా 5:11 వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.

ఎజ్రా 5:12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

ఎజ్రా 5:13 అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

ఎజ్రా 5:14 మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి

ఎజ్రా 5:15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

ఎజ్రా 5:16 కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

ఎజ్రా 5:17 కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతినిగూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము.

ఎజ్రా 6:13 అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.

యెషయా 56:6 విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

యెషయా 56:7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.

అపోస్తలులకార్యములు 18:27 తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.

ప్రకటన 12:16 భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.

ఎస్తేరు 9:3 మొర్దెకైనిగూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి.