Logo

ఆదికాండము అధ్యాయము 25 వచనము 22

1సమూయేలు 9:9 ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.

1సమూయేలు 10:22 కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.

1సమూయేలు 22:15 అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటివారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

1సమూయేలు 28:6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.

1సమూయేలు 30:8 నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.

యెహెజ్కేలు 20:31 నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

యెహెజ్కేలు 36:37 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణ చేయనిత్తును, గొఱ్ఱలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.

ఆదికాండము 27:29 జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక

న్యాయాధిపతులు 6:13 గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయులచేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

లూకా 1:41 ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను

యోహాను 1:13 వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలన నైనను శరీరేచ్ఛవలన నైనను మానుషేచ్ఛవలన నైనను పుట్టినవారు కారు.

రోమీయులకు 9:12 పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.