Logo

ఆదికాండము అధ్యాయము 25 వచనము 33

ఆదికాండము 14:22 అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొన

ఆదికాండము 24:3 నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

మార్కు 6:23 మరియు నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను

హెబ్రీయులకు 6:16 మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణముచేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.

ఆదికాండము 27:36 ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చియుంచలేదా అని అడిగెను.

ఆదికాండము 36:6 ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;

ఆదికాండము 36:7 వారు విస్తారమయిన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.

హెబ్రీయులకు 12:16 ఒకపూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

ఆదికాండము 26:31 తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతనియొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

ఆదికాండము 27:13 అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా

ఆదికాండము 27:29 జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక