Logo

ఆదికాండము అధ్యాయము 31 వచనము 2

ఆదికాండము 4:5 కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

ద్వితియోపదేశాకాండము 28:54 మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్యయెడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లలయెడలను చెడ్డదైనందున

1సమూయేలు 18:9 కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.

1సమూయేలు 18:10 మరునాడు దేవుని యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా1 దావీదు మునుపటిలాగున వీణ చేతపట్టుకొని వాయించెను.

1సమూయేలు 18:11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.

దానియేలు 3:19 అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

ఆదికాండము 30:27 అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

నిర్గమకాండము 4:10 అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటిమాంద్యము నాలుకమాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

ద్వితియోపదేశాకాండము 19:4 పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక

1సమూయేలు 19:7 అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.

ఆదికాండము 31:5 మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;

యెహోషువ 3:4 మీకును దానికిని దాదాపు రెండువేలకొల మూరల యెడముండ వలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.