Logo

ఆదికాండము అధ్యాయము 31 వచనము 19

ఆదికాండము 31:30 నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

ఆదికాండము 31:32 ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నాయొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.

ఆదికాండము 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

యెహోషువ 24:2 యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.

న్యాయాధిపతులు 17:4 అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమును చేయగా అది మీకా యింట ఉంచబడెను.

న్యాయాధిపతులు 17:5 మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.

న్యాయాధిపతులు 18:14 కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మను ష్యులు తమ సహోదరులను చూచిఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా

న్యాయాధిపతులు 18:15 వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవను డున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.

న్యాయాధిపతులు 18:16 దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధములను కట్టుకొని

న్యాయాధిపతులు 18:17 గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందల మంది మను ష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.

న్యాయాధిపతులు 18:18 వీరు మీకా యింటికిపోయి చెక్క బడిన ప్రతిమను ఏఫో దును గృహదేవతలను పోతవి గ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడుమీరేమి చేయుచున్నారని వారి నడుగగా

న్యాయాధిపతులు 18:19 వారునీవు ఊర కుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజ కుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్ర మునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి.

న్యాయాధిపతులు 18:20 అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను.

న్యాయాధిపతులు 18:21 అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి.

న్యాయాధిపతులు 18:22 వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరు గిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా

న్యాయాధిపతులు 18:23 వారు తమ ముఖములను త్రిప్పు కొనినీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడ నేల? అని మీకాను అడిగిరి.

న్యాయాధిపతులు 18:24 అందు కతడునేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టు కొని పోవుచున్నారే, యిక నాయొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా

న్యాయాధిపతులు 18:31 దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.

1సమూయేలు 19:13 తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి

యెహెజ్కేలు 21:21 బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.

హోషేయ 3:4 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

ఆదికాండము 31:30 నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

ఆదికాండము 24:38 అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థులయొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసి కొనిరావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

ఆదికాండము 31:34 రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు.

ఆదికాండము 38:12 చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను

ద్వితియోపదేశాకాండము 27:15 మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్‌ అనవలెను.

2రాజులు 23:24 మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.

యెషయా 44:13 వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యము గలదానిగాను చేయును.

జెకర్యా 10:2 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.