Logo

ఆదికాండము అధ్యాయము 44 వచనము 26

ఆదికాండము 43:4 కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.

ఆదికాండము 43:5 నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడుమీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.

లూకా 11:7 అతడు లోపలనే యుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?

ఆదికాండము 43:8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;

ఆదికాండము 44:12 అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.

2సమూయేలు 3:13 అయితే నీవు ఒకపని చేయవలెను; దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నాయొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.