Logo

ఆదికాండము అధ్యాయము 44 వచనము 30

ఆదికాండము 44:17 అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవును గాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రియొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా

ఆదికాండము 44:31 అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొనియున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము

ఆదికాండము 44:34 ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

1సమూయేలు 18:1 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.

1సమూయేలు 25:29 నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.

2సమూయేలు 18:33 అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి యేడ్చుచు, సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

ఆదికాండము 44:22 అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.

ద్వితియోపదేశాకాండము 24:6 తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.

1సమూయేలు 23:15 తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.

విలాపవాక్యములు 4:20 మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.