Logo

సామెతలు అధ్యాయము 5 వచనము 3

సామెతలు 10:21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుటచేత మూఢులు చనిపోవుదురు.

సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

సామెతలు 15:7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు

సామెతలు 16:23 జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.

సామెతలు 20:15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

కీర్తనలు 45:2 నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.

కీర్తనలు 71:15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

కీర్తనలు 119:13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.

పరమగీతము 4:11 ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

మలాకీ 2:6 సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

మలాకీ 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.

యోబు 33:33 మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.

సామెతలు 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

సామెతలు 22:17 చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము.

సామెతలు 23:12 ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.

1దెస్సలోనీకయులకు 2:11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,