Logo

సామెతలు అధ్యాయము 5 వచనము 5

సామెతలు 6:24 చెడు స్త్రీయొద్దకు పోకుండను పర స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.

సామెతలు 6:25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము.

సామెతలు 6:26 వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.

సామెతలు 6:27 ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?

సామెతలు 6:28 ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?

సామెతలు 6:29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

సామెతలు 6:30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినయెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

సామెతలు 6:31 వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.

సామెతలు 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

సామెతలు 6:33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.

సామెతలు 6:34 భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.

సామెతలు 6:35 ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.

సామెతలు 7:22 వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

సామెతలు 7:23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

సామెతలు 9:18 అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.

సామెతలు 23:27 వేశ్య లోతైన గొయ్యి పర స్త్రీ యిరుకైన గుంట.

సామెతలు 23:28 దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

ప్రసంగి 7:26 మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.

హెబ్రీయులకు 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,

హెబ్రీయులకు 12:16 ఒకపూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

న్యాయాధిపతులు 16:4 పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా

న్యాయాధిపతులు 16:5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమెయొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణములను నీకిచ్చెదమని చెప్పిరి.

న్యాయాధిపతులు 16:6 కాబట్టి దెలీలానీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా

న్యాయాధిపతులు 16:15 అప్పుడు ఆమెనాయందు నీకిష్టము లేనప్పుడునేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.

న్యాయాధిపతులు 16:16 ఆమె అనుదినమును మాటలచేత అత ని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.

న్యాయాధిపతులు 16:17 అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసినేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.

న్యాయాధిపతులు 16:18 అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించియీసారికి రండి; ఇతడు తన అభి ప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలనుచేత పట్టుకొని ఆమెయొద్దకు రాగా

న్యాయాధిపతులు 16:19 ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీది యేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.

న్యాయాధిపతులు 16:20 ఆమెసమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడు చున్నారనగా అతడు నిద్రమేలుకొనియెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.

న్యాయాధిపతులు 16:21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.

కీర్తనలు 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.

సంఖ్యాకాండము 5:18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తలముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

సంఖ్యాకాండము 5:27 ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.

సామెతలు 2:18 దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును

సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.

ప్రకటన 8:11 ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదైపోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.