Logo

దానియేలు అధ్యాయము 2 వచనము 1

దానియేలు 6:28 ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్థిల్లెను.

దానియేలు 10:1 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసినదాయెను.

కీర్తనలు 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

కీర్తనలు 112:8 వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.

దానియేలు 5:13 అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా?

దానియేలు 9:1 మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.