Logo

దానియేలు అధ్యాయము 2 వచనము 38

1రాజులు 4:24 యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.

ఎజ్రా 7:12 రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను

యెషయా 10:8 అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?

యెషయా 47:5 కల్దీయుల కుమారీ, మౌనముగానుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.

యిర్మియా 27:6 ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.

యిర్మియా 27:7 అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.

యెహెజ్కేలు 26:7 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి

హోషేయ 8:10 వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.

ప్రకటన 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

ప్రకటన 17:14 వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

దానియేలు 4:25 తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపుమంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.

దానియేలు 4:32 తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

దానియేలు 5:18 రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.

2దినవృత్తాంతములు 36:23 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.

ఎజ్రా 1:2 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

సామెతలు 8:15 నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలన చేయుదురు.

యిర్మియా 28:14 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను.

ప్రకటన 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది.

దానియేలు 4:3 ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

దానియేలు 4:34 ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.

కీర్తనలు 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

మత్తయి 6:13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

యోహాను 19:11 అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

ప్రకటన 4:11 ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి

ప్రకటన 5:12 వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

యెహోషువ 8:1 మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీచేతికప్పగించు చున్నాను.

2సమూయేలు 10:19 హదదెజరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.

1రాజులు 20:1 తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడివేసి దానిమీద యుద్ధము చేసెను.

2రాజులు 18:24 అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే.

2రాజులు 25:28 అతనితో దయగా మాటలాడి, అతని పీఠమును బబులోనులో తనయొద్దనున్న రాజుల పీఠములకంటె ఎత్తుచేసెను.

ఎస్తేరు 1:4 అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

కీర్తనలు 75:7 దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును

పరమగీతము 5:11 అతని శిరస్సు అపరంజి వంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.

యెషయా 13:19 అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.

యిర్మియా 5:15 ఇశ్రాయేలు కుటుంబము వారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.

యిర్మియా 34:1 బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

యిర్మియా 52:32 అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.

యెహెజ్కేలు 28:14 అభిషేకమునొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

యెహెజ్కేలు 31:9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.

దానియేలు 1:2 ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతికప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.

దానియేలు 2:32 ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

దానియేలు 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

దానియేలు 2:47 మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను.

దానియేలు 4:22 రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడవైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

దానియేలు 7:3 అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.

దానియేలు 7:17 ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.

జెకర్యా 1:18 అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.

మత్తయి 4:9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా

మత్తయి 20:25 గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.

ప్రకటన 6:4 అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను