Logo

దానియేలు అధ్యాయము 11 వచనము 6

దానియేలు 11:8 మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.

దానియేలు 11:9 అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.

దానియేలు 11:11 అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును; ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

దానియేలు 11:14 ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

దానియేలు 11:25 అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.

దానియేలు 11:40 అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుఱ్ఱపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతని మీదపడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

దానియేలు 11:3 అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

దానియేలు 11:4 అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

జెకర్యా 6:6 నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.