Logo

దానియేలు అధ్యాయము 11 వచనము 30

దానియేలు 8:19 మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమునుగూర్చినది

దానియేలు 10:1 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసినదాయెను.

యెషయా 14:31 గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.

అపోస్తలులకార్యములు 17:26 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని,

గలతీయులకు 4:2 తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును.

దానియేలు 11:23 అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనము గలవాడైనను ఎదురాడి బలము పొందును.

దానియేలు 11:25 అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.

దానియేలు 11:27 కీడు చేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.

దానియేలు 11:35 నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.