Logo

జెకర్యా అధ్యాయము 1 వచనము 13

జెకర్యా 1:8 రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

జెకర్యా 1:10 అప్పుడు గొంజిచెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.

జెకర్యా 1:11 అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతట తిరుగులాడి వచ్చియున్నాము; ఇదిగో లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.

నిర్గమకాండము 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.

నిర్గమకాండము 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.

నిర్గమకాండము 23:22 అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునైయుందును.

నిర్గమకాండము 23:23 ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.

యెషయా 63:9 వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

హెబ్రీయులకు 7:25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.

కీర్తనలు 74:10 దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?

కీర్తనలు 69:5 దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.

కీర్తనలు 102:13 నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.

యెషయా 64:9 యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసికొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

యెషయా 64:10 నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

యెషయా 64:11 మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

యెషయా 64:12 యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

ప్రకటన 6:10 వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

జెకర్యా 7:5 దేశపు జనులందరికిని యాజకులకును నీవీమాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?

2దినవృత్తాంతములు 36:21 యిర్మీయాద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను.

యిర్మియా 25:11 ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.

యిర్మియా 25:12 యెహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.

యిర్మియా 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.

దానియేలు 9:2 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.

ప్రసంగి 3:3 చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;

యెషయా 63:17 యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము.

యెషయా 64:12 యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

యిర్మియా 34:22 యెహోవా వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

యెహెజ్కేలు 38:12 వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగిపోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగిపోయెదను.

దానియేలు 12:6 ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా

హోషేయ 2:4 దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.

హోషేయ 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;

హబక్కూకు 3:2 యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.