Logo

లేవీయకాండము అధ్యాయము 10 వచనము 16

లేవీయకాండము 6:26 పాపపరిహారార్థబలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.

లేవీయకాండము 6:30 మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.

లేవీయకాండము 9:3 మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలినర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱపిల్లను

లేవీయకాండము 9:15 అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటిదానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను.

నిర్గమకాండము 32:19 అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తనచేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను

నిర్గమకాండము 32:20 మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.

నిర్గమకాండము 32:21 అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా

నిర్గమకాండము 32:22 అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు.

సంఖ్యాకాండము 12:3 యెహోవా ఆ మాట వినెను. మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.

మత్తయి 5:22 నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

మార్కు 3:5 ఆయన వారి హృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

మార్కు 10:14 యేసు అది చూచి కోపపడి చిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే.

ఎఫెసీయులకు 4:26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.

నిర్గమకాండము 29:34 ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండినయెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.

లేవీయకాండము 3:12 అతడు అర్పించునది మేకయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 7:17 మిగిలినది మరునాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలినదానిని అగ్నితో కాల్చివేయవలెను.

సంఖ్యాకాండము 31:14 అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.

2రాజులు 13:19 అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదు మారులైన ఆరు మారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.

1దినవృత్తాంతములు 6:3 అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

1దినవృత్తాంతములు 6:50 అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,

ఎజ్రా 7:5 బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు.