Logo

లేవీయకాండము అధ్యాయము 11 వచనము 15

ఆదికాండము 8:7 ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను.

1రాజులు 17:4 ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా

1రాజులు 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొని వచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.

సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.

లూకా 12:24 కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.