Logo

లేవీయకాండము అధ్యాయము 25 వచనము 27

లేవీయకాండము 25:50 అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.

లేవీయకాండము 25:51 ఇంక అనేక సంవత్సరములు మిగిలియుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.

లేవీయకాండము 25:52 సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనయెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను.

లేవీయకాండము 25:53 ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.

లేవీయకాండము 25:24 మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను.

లేవీయకాండము 27:18 సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్కచొప్పున, అనగా మరుసటి సునాద సంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.