Logo

లేవీయకాండము అధ్యాయము 9 వచనము 9

లేవీయకాండము 4:6 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 4:7 అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.

లేవీయకాండము 4:17 ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 4:18 మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహనబలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

లేవీయకాండము 4:25 ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.

లేవీయకాండము 4:30 యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.

లేవీయకాండము 8:15 దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.

లేవీయకాండము 16:18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి

హెబ్రీయులకు 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

హెబ్రీయులకు 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.

హెబ్రీయులకు 9:23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను.

హెబ్రీయులకు 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.

హెబ్రీయులకు 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి.

హెబ్రీయులకు 10:6 పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవి కావు.

హెబ్రీయులకు 10:7 అప్పుడు నేను గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

హెబ్రీయులకు 10:8 బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

హెబ్రీయులకు 10:9 ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

హెబ్రీయులకు 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము.

హెబ్రీయులకు 10:11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.

హెబ్రీయులకు 10:12 ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి,

హెబ్రీయులకు 10:13 అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.

హెబ్రీయులకు 10:14 ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

హెబ్రీయులకు 10:15 ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.

హెబ్రీయులకు 10:16 ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత

హెబ్రీయులకు 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 10:18 వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

హెబ్రీయులకు 10:19 సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

నిర్గమకాండము 29:12 ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను.

లేవీయకాండము 3:5 అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

యెహెజ్కేలు 43:15 దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండమునుండి పైకి నాలుగు కొమ్ములుండెను,

యెహెజ్కేలు 43:20 వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.

హెబ్రీయులకు 9:21 అదేవిధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.

హెబ్రీయులకు 13:11 వేటి రక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.