లూకా 6:29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము.
1కొరిందీయులకు 6:7 ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?