Logo

మార్కు అధ్యాయము 5 వచనము 10

లూకా 8:30 యేసు నీ పేరేమని వానినడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,

లూకా 11:21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.

లూకా 11:22 అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.

లూకా 11:23 నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.

లూకా 11:24 అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని

లూకా 11:25 వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి

లూకా 11:26 వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.

మత్తయి 12:45 అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.

మత్తయి 26:53 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనావ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?

అపోస్తలులకార్యములు 19:15 అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా