Logo

మార్కు అధ్యాయము 5 వచనము 20

కీర్తనలు 66:16 దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

యెషయా 38:9 యూదారాజైన హిజ్కియా రోగియై ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచియించినది.

యెషయా 38:10 నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళద్వారమున పోవలసివచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొనియున్నాను.

యెషయా 38:11 యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని.

యెషయా 38:12 నా నివాసము పెరికివేయబడెను గొఱ్ఱలకాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తికొనిపోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తిచేయుచున్నావు.

యెషయా 38:13 ఉదయమగువరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పిచేత నా యెముకలన్నియు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తిచేయుదువు

యెషయా 38:14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.

యెషయా 38:15 నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమునుబట్టి నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచుకొందును.

యెషయా 38:16 ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు

యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతినుండి విడిపించితివి. నీవీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి.

యెషయా 38:18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు.

యెషయా 38:19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు

యెషయా 38:20 మన జీవితదినములన్నియు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము.

దానియేలు 4:1 రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

దానియేలు 4:2 మహోన్నతుడగు దేవుడు నాయెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.

దానియేలు 4:3 ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

దానియేలు 4:37 ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు నున్నాను.

దానియేలు 6:25 అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక.

దానియేలు 6:26 నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.

దానియేలు 6:27 ఆయన విడిపించువాడును రక్షించువాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.

యోనా 2:1 ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.

యోనా 2:2 నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

యోనా 2:3 నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసియున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

యోనా 2:4 నీ సన్నిధిలోనుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరల చూచెదననుకొంటిని.

యోనా 2:5 ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించియున్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనియున్నది.

యోనా 2:6 నేను మరెన్నటికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.

యోనా 2:7 కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.

యోనా 2:8 అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.

యోనా 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.

యోనా 2:10 అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను.

యోహాను 4:29 మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా

అపోస్తలులకార్యములు 22:1 సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.

అపోస్తలులకార్యములు 22:2 అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.

అపోస్తలులకార్యములు 22:3 నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి

అపోస్తలులకార్యములు 22:4 ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.

అపోస్తలులకార్యములు 22:5 ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.

అపోస్తలులకార్యములు 22:6 నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.

అపోస్తలులకార్యములు 22:7 నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.

అపోస్తలులకార్యములు 22:8 అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 22:9 నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.

అపోస్తలులకార్యములు 22:10 అప్పుడు నేను ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.

అపోస్తలులకార్యములు 22:11 ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.

అపోస్తలులకార్యములు 22:12 అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి

అపోస్తలులకార్యములు 22:13 సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.

అపోస్తలులకార్యములు 22:14 అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు;

అపోస్తలులకార్యములు 22:15 నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.

అపోస్తలులకార్యములు 22:16 గనుక నీవు తడవుచేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 22:17 అంతట నేను యెరూషలేమునకు తిరిగివచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.

అపోస్తలులకార్యములు 22:18 అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 22:19 అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.

అపోస్తలులకార్యములు 22:20 మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.

అపోస్తలులకార్యములు 22:21 అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 26:4 మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

అపోస్తలులకార్యములు 26:5 వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.

అపోస్తలులకార్యములు 26:6 ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.

అపోస్తలులకార్యములు 26:7 మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపియున్నారు.

అపోస్తలులకార్యములు 26:8 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?

అపోస్తలులకార్యములు 26:9 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

అపోస్తలులకార్యములు 26:10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;

అపోస్తలులకార్యములు 26:11 అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని

అపోస్తలులకార్యములు 26:12 అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

అపోస్తలులకార్యములు 26:13 రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

అపోస్తలులకార్యములు 26:14 మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

అపోస్తలులకార్యములు 26:15 అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.

అపోస్తలులకార్యములు 26:16 నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;

అపోస్తలులకార్యములు 26:17 నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

అపోస్తలులకార్యములు 26:18 వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

అపోస్తలులకార్యములు 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

అపోస్తలులకార్యములు 26:20 మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

అపోస్తలులకార్యములు 26:21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి;

అపోస్తలులకార్యములు 26:22 అయినను నేను దేవునివలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని

అపోస్తలులకార్యములు 26:23 ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.

అపోస్తలులకార్యములు 26:24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతివిద్య వలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 26:25 అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనతవహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.

అపోస్తలులకార్యములు 26:26 రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండలేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.

అపోస్తలులకార్యములు 26:27 అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

అపోస్తలులకార్యములు 26:28 అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 26:29 అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

2రాజులు 5:4 నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా

మార్కు 8:2 జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను;

మార్కు 9:22 అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.

లూకా 8:38 అయితే ఆయన నీవు నీ యింటికి తిరిగివెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చెసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను

అపోస్తలులకార్యములు 10:24 మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.