Logo

మార్కు అధ్యాయము 5 వచనము 25

లూకా 7:6 కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

అపోస్తలులకార్యములు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను

మార్కు 5:31 ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.

మార్కు 3:9 జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

మార్కు 3:10 ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి.

మార్కు 3:20 ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.

లూకా 8:42 అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ (కొన్ని ప్రాచీన ప్రతులలో స్త్రీ యుండెను. ఆమె తన జీవనోపాధి యంతయు వైద్యులకు వ్యయము చేసి, అని కూర్చబడినది) యెవనిచేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి

లూకా 8:45 యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలిపోయినదని, నాకు తెలిసినదనెను.

లూకా 12:1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి

లూకా 19:3 యేసు ఎవరోయని చూడగోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడలేకపోయెను.

మత్తయి 8:7 యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా

లూకా 5:1 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి,