Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 12 వచనము 22

1రాజులు 22:10 ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాలస్థలమందు గద్దెలమీద ఆసీనులైయుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా

యోబు 15:21 భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వానిమీదికి వచ్చెదరు.

సామెతలు 18:12 ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును.

యెషయా 5:14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

మలాకీ 3:15 గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.

అపోస్తలులకార్యములు 24:1 అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.

అపోస్తలులకార్యములు 25:23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.