అపోస్తలులకార్యములు 13:30 అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
అపోస్తలులకార్యములు 2:24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.
యెహోషువ 1:1 యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెనునా సేవకుడైన మోషే మృతినొందెను.
యోహాను 3:30 ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.
అపోస్తలులకార్యములు 9:18 అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
అపోస్తలులకార్యములు 13:35 కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవని చెప్పుచున్నాడు.