Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 14 వచనము 22

మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు

అపోస్తలులకార్యములు 14:1 ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.

అపోస్తలులకార్యములు 14:6 వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.

అపోస్తలులకార్యములు 14:8 అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.

అపోస్తలులకార్యములు 14:19 అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.

అపోస్తలులకార్యములు 13:14 అప్పుడు వారు పెర్గేనుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.

అపోస్తలులకార్యములు 13:51 వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 15:36 కొన్ని దినములైన తరువాత ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.

అపోస్తలులకార్యములు 16:2 అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.

2తిమోతి 3:11 అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను

దానియేలు 11:33 జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.

అపోస్తలులకార్యములు 14:7 లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.

అపోస్తలులకార్యములు 16:1 పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.