Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 18 వచనము 2

అపోస్తలులకార్యములు 17:32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 17:33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.

అపోస్తలులకార్యములు 19:1 అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా

1కొరిందీయులకు 1:2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

2కొరిందీయులకు 1:1 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

2కొరిందీయులకు 1:23 మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.

2తిమోతి 4:20 ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచి వచ్చితిని.

మత్తయి 10:11 మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.

అపోస్తలులకార్యములు 17:15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొనివచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరిపోయిరి.

రోమీయులకు 15:19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.

1కొరిందీయులకు 2:1 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.

1కొరిందీయులకు 14:36 దేవుని వాక్యము మీయొద్దనుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?

2కొరిందీయులకు 11:7 మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?

2కొరిందీయులకు 11:26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని

1దెస్సలోనీకయులకు 1:7 కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

1దెస్సలోనీకయులకు 3:6 తిమోతియు ఇప్పుడు మీయొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడనపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడనపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమునుగూర్చియు మీ ప్రేమనుగూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.