Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 26 వచనము 27

అపోస్తలులకార్యములు 26:2 అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక

అపోస్తలులకార్యములు 26:3 యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.

అపోస్తలులకార్యములు 25:22 అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

అపోస్తలులకార్యములు 2:2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

అపోస్తలులకార్యములు 2:3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

అపోస్తలులకార్యములు 2:4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపోస్తలులకార్యములు 2:5 ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

అపోస్తలులకార్యములు 2:6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.

అపోస్తలులకార్యములు 2:7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

అపోస్తలులకార్యములు 2:8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

అపోస్తలులకార్యములు 2:9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,

అపోస్తలులకార్యములు 2:10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,

అపోస్తలులకార్యములు 2:11 క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 2:12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 4:16 ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము

అపోస్తలులకార్యములు 4:17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 4:18 అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి.

అపోస్తలులకార్యములు 4:19 అందుకు పేతురును యోహానును వారినిచూచి దేవునిమాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

అపోస్తలులకార్యములు 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

అపోస్తలులకార్యములు 4:21 ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.

అపోస్తలులకార్యములు 5:18 అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.

అపోస్తలులకార్యములు 5:19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి

అపోస్తలులకార్యములు 5:20 ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

అపోస్తలులకార్యములు 5:21 వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి వారిని తోడుకొనిరండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.

అపోస్తలులకార్యములు 5:22 బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి

అపోస్తలులకార్యములు 5:23 చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.

అపోస్తలులకార్యములు 5:24 అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

అపోస్తలులకార్యములు 5:25 అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా

అపోస్తలులకార్యములు 5:26 అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.

అపోస్తలులకార్యములు 5:27 వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా

అపోస్తలులకార్యములు 5:28 ప్రధానయాజకుడు వారిని చూచి మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.

అపోస్తలులకార్యములు 5:29 అందుకు పేతురును అపొస్తలులు నుమనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

అపోస్తలులకార్యములు 5:30 మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.

అపోస్తలులకార్యములు 5:31 ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలముచేత హెచ్చించియున్నాడు.

అపోస్తలులకార్యములు 5:32 మేమును, దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 5:33 వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా

అపోస్తలులకార్యములు 5:34 సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

అపోస్తలులకార్యములు 5:35 ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి.

అపోస్తలులకార్యములు 5:36 ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.

అపోస్తలులకార్యములు 5:37 వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరిపోయిరి.

అపోస్తలులకార్యములు 5:38 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యులజోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.

అపోస్తలులకార్యములు 5:39 దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

అపోస్తలులకార్యములు 5:40 వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

అపోస్తలులకార్యములు 5:41 ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

అపోస్తలులకార్యములు 5:42 ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

యెషయా 30:20 ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

మత్తయి 26:5 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

మత్తయి 27:29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడిచేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

మత్తయి 27:30 ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

మత్తయి 27:31 ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి.

మత్తయి 27:32 వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి.

మత్తయి 27:33 వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి

మత్తయి 27:34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

మత్తయి 27:35 వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

మత్తయి 27:36 అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి.

మత్తయి 27:37 ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

మత్తయి 27:38 మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువ వేయబడిరి.

మత్తయి 27:39 ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

మత్తయి 27:40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

మత్తయి 27:41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

మత్తయి 27:42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

మత్తయి 27:43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

మత్తయి 27:44 ఆయనతో కూడ సిలువ వేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

మత్తయి 27:45 మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.

మత్తయి 27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

మత్తయి 27:47 అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

మత్తయి 27:48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

మత్తయి 27:49 తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.

మత్తయి 27:50 యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

మత్తయి 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;

మత్తయి 27:52 సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.

మత్తయి 27:53 వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.

మత్తయి 27:54 శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలియున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.

దానియేలు 3:27 అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

మత్తయి 9:26 ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.

లూకా 6:8 అయితే ఆయన వారి ఆలోచనలెరిగి, ఊచచెయ్యి గలవానితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.

యోహాను 18:20 యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.

అపోస్తలులకార్యములు 2:22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.

అపోస్తలులకార్యములు 2:29 సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;

అపోస్తలులకార్యములు 4:29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి

అపోస్తలులకార్యములు 10:37 యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును

అపోస్తలులకార్యములు 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

2కొరిందీయులకు 5:11 కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

2తిమోతి 1:5 ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.