Logo

2కొరిందీయులకు అధ్యాయము 2 వచనము 7

2కొరిందీయులకు 13:10 కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.

1కొరిందీయులకు 5:4 ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,

1కొరిందీయులకు 5:5 నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.

1తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

2సమూయేలు 24:16 అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా

మత్తయి 13:28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

మత్తయి 18:17 అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

యోహాను 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

2కొరిందీయులకు 13:3 క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడైయున్నాడు.

గలతీయులకు 5:10 మీరెంతమాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.

2దెస్సలోనీకయులకు 3:15 అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.