Logo

2కొరిందీయులకు అధ్యాయము 13 వచనము 14

రోమీయులకు 16:16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

రోమీయులకు 16:21 నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

రోమీయులకు 16:22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.

రోమీయులకు 16:23 నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలిప్పీయులకు 4:21 ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.

ఫిలిప్పీయులకు 4:22 నాతో కూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలేమోనుకు 1:23 క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,

ఫిలేమోనుకు 1:24 నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.

హెబ్రీయులకు 13:24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

1పేతురు 5:13 బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.

2యోహాను 1:13 ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.

3యోహాను 1:14 శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీయొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.

1కొరిందీయులకు 16:20 సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

ఎఫెసీయులకు 3:18 మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

2తిమోతి 4:21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.