Logo

హోషేయ అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దానియొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.

02 కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని

03 చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.

04 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

05 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి తమ దేవుడైన యెహోవాయొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయనయొద్దకు వత్తురు.