Logo

2సమూయేలు అధ్యాయము 23 వచనము 34

2సమూయేలు 11:3 ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

2సమూయేలు 15:31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.

2సమూయేలు 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

1దినవృత్తాంతములు 27:33 అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.

1దినవృత్తాంతములు 27:34 అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.

యెహోషువ 12:5 హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.

1దినవృత్తాంతములు 11:35 హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

యిర్మియా 40:8 కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.