Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 11 వచనము 15

2సమూయేలు 23:13 మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,

2సమూయేలు 23:14 దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లెహేములో ఉండిరి.

2సమూయేలు 23:15 దావీదు బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా

2సమూయేలు 23:16 ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసి యెహోవా, నేను ఇవి త్రాగను;

2సమూయేలు 23:17 ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి.

2సమూయేలు 23:18 సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు.

2సమూయేలు 23:19 ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతియాయెను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను.

2సమూయేలు 23:20 మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న యొక సింహమును చంపివేసెను.

2సమూయేలు 23:21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయునిచేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వానిచేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.

2సమూయేలు 23:22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

2సమూయేలు 23:23 ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.

2సమూయేలు 23:24 ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,

2సమూయేలు 23:25 హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

2సమూయేలు 23:26 పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

2సమూయేలు 23:27 అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

2సమూయేలు 23:28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

2సమూయేలు 23:29 నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,

2సమూయేలు 23:30 పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

2సమూయేలు 23:31 అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

2సమూయేలు 23:32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను,

2సమూయేలు 23:33 హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీయాము,

2సమూయేలు 23:34 మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతో పెలు కుమారుడగు ఏలీయాము,

2సమూయేలు 23:35 కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,

2సమూయేలు 23:36 సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,

2సమూయేలు 23:37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.

2సమూయేలు 23:38 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

2సమూయేలు 23:39 హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు.

యెహోషువ 12:15 అదుల్లాము రాజు, మక్కేదా రాజు,

1సమూయేలు 22:1 దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.

మీకా 1:15 మారేషా నివాసీ, నీకు హక్కుదారుడగు ఒకని నీయొద్దకు తోడుకొనివత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

1దినవృత్తాంతములు 14:9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి.

2సమూయేలు 5:18 ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

2సమూయేలు 5:22 ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

యెషయా 17:5 చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

యెహోషువ 15:8 ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.

ఆదికాండము 14:5 పదునాలుగవ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో

1సమూయేలు 22:2 మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండువారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందలమంది వచ్చియుండిరి.

1దినవృత్తాంతములు 12:4 ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,