Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 11 వచనము 22

1దినవృత్తాంతములు 27:5 మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

1దినవృత్తాంతములు 27:6 ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పదిమందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను.

2సమూయేలు 8:18 యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.

2సమూయేలు 20:23 యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.

2సమూయేలు 23:20 మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న యొక సింహమును చంపివేసెను.

2సమూయేలు 23:21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయునిచేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వానిచేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.

2సమూయేలు 23:22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

2సమూయేలు 23:23 ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.

1రాజులు 1:8 యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

1రాజులు 1:38 కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొనిరాగా

1రాజులు 2:30 బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు అదికాదు, నేనిక్కడనే చచ్చెదననగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను.

1రాజులు 2:34 కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.

1రాజులు 2:35 రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.

యెహోషువ 15:21 దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగాకబ్సెయేలు

1దినవృత్తాంతములు 12:8 మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.

2సమూయేలు 1:23 సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరు గలవారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు.

న్యాయాధిపతులు 14:5 అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.

న్యాయాధిపతులు 14:6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.

1సమూయేలు 17:34 అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱపిల్లను ఎత్తికొని పోవుచుండగ.

1సమూయేలు 17:35 నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.

1సమూయేలు 17:36 మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,

1దినవృత్తాంతములు 12:21 వారందరును పరాక్రమశాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి.