Logo

ఆదికాండము అధ్యాయము 12 వచనము 17

ఆదికాండము 20:18 ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

1దినవృత్తాంతములు 16:21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి

1దినవృత్తాంతములు 21:22 ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా

యోబు 34:19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వానితోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?

కీర్తనలు 105:14 నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి

కీర్తనలు 105:15 ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

హెబ్రీయులకు 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

ఆదికాండము 20:7 కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించనియెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

మార్కు 3:10 ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి.